మెంబర్షిప్ వివరాలు

తెలుగు సినీ రచయితల సంఘంలో మెంబర్షిప్ వివరాలు :

 

తెలుగు సినీ రచయితల సంఘంలో కొత్తగా ‘అసోసియేట్ మెంబర్’, ‘జీవిత సభ్యులు’ కావాలనుకొనేవారు పాటించవలసిన నిబంధనలు ఉన్నాయి, తెలుగు సినీ రచయితల సంఘం అడ్రస్ : 8-3-720/9/2, శాలివాహన నగర్, శ్రీనగర్ కాలని, హైదరాబాద్-73. గూగుల్ మ్యాప్ లో తెలుగు సినీ రచయితల సంఘం అని కొట్టగానే అడ్రస్ క్లియర్గా మ్యాప్ వస్తుంది హాయిగా వచ్చేసేయండి. ఫోన్ నెంబర్స్ కూడా 040-23738455, సెల్ నంబర్ 9989990229.

 

 

కొత్తగా అసోసియేట్ మెంబర్ కాదల్చుకున్నవారు :

 

  1. ‘అసోసియేట్ మెంబర్షిప్’ కోసం కార్యాలయం లో రూ.100/`లు చెల్లించి దరఖాస్తు ‘ఫారం తీసుకుని వాటిని పూర్తిచేయాలి. కావాల్సిన ఆధారాలు జతపర్చి, కార్యాలయానికి అందజేయాలి.
  1. ‘అసోసియేట్ మెంబర్’ కాదల్చుకున్నవారు తమ ‘అడ్రస్ ప్రూఫ్’, ‘ఐ.డి. ప్రూఫ్’(ఆధార్ కార్డు జిరాక్స్) విధిగా జతపర్చాలి.
  1. 3పాస్పోర్ట్ సైజు ఫోటో లు జతపర్చాలి.
  1. అసోసియేట్ మెంబర్ అవ్వాలి అంటే రచయితల సంఘంలో ‘లైఫ్ మెంబర్ ‘ గా వున్నవారి యొక్క ‘ఇంట్రడక్షన్’ సంతకం ‘అప్లికేషన్’ పై చేయించుకోవాలి. వారికి మీరు తెలిసినట్లు / వారి వద్ద మీరు పనిచేసినట్లు తెలిపే ధృవపత్రం, వారి ‘మెంబర్షిప్’ నెంబరు తెలిపే ‘ఐ.డి. కార్డు ‘జిరాక్స్ కాపీ ని జతపరచాలి.
  1. ‘అసోసియేట్ మెంబర్షిప్’ కు చెల్లించాల్సిన విరాళం ‘డ్రాఫ్ట్’రూపంలో జతపరచాలి.

పైవిధంగా పూర్తిచేసిన దరఖాస్తులను అన్ని విధాలుగా పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకునే హక్కు కార్యవర్గానిదే. నెల నెలా జరిగే కార్యవర్గ సమావేశంలో అప్పటివరకు వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం తీసుకోబడుతుంది.

 

డైరెక్ట్ గా లైఫ్ మెంబర్ కాదల్చుకున్నవారు పాటించవలసిన నిబంధనలు :

 

  1. ‘లైఫ్ మెంబర్’ గా మారటానికి కార్యాలయంలో రూ.100/` లు చెల్లించి దరఖాస్తు ‘ఫారం’ తీసుకుని పూర్తిచేసి, ‘అడ్రస్ ప్రూఫ్’, ‘ఐ.డి. ప్రూఫ్’(ఆధార్ కార్డు జిరాక్స్) జతపర్చి కార్యాలయానికి అందజేయాలి.
  1. పాస్పోర్ట్ సైజు ఫోటో’ లు 2 జతపరచాలి.
  1. రచయితల సంఘంలో ‘లైఫ్ మెంబర్ ‘ గా వున్నవారి యొక్క ‘ఇంట్రడక్షన్’ సంతకం ‘అప్లికేషన్’ పై చేయించుకోవాలి. వారికి మీరు తెలిసినట్లు / వారి వద్ద మీరు పనిచేసినట్లు తెలిపే ధృవపత్రం, వారి ‘మెంబర్షిప్’ నెంబరు తెలిపే ‘ఐ.డి. కార్డు ‘జిరాక్స్ కాపీ ని జతపరచాలి.
  1. ‘లైఫ్ మెంబర్’ గా కావటానికి, మీరు రచనా విభాగంలో పని చేసిన చిత్రంయొక్క పేరు, ఆ చిత్రంలో మీ పేరు ఉన్నదని ఋజువుపరచడానికి ‘డివిడి’ ద్వారా కాని, పెన్ డ్రైవ్ ద్వారా కాని పూర్తి చిత్రాన్ని జతపరచాలి.
  1. లైఫ్ మెంబర్’ కావటానికి తగిన విరాళాన్ని ‘డ్రాఫ్ట్ గా’ జతపరచాలి.

పైవిధంగా పూర్తిచేసిన దరఖాస్తులను అన్ని విధాలుగా పరిశీలించి మెంబర్షిప్ కమిటీ ఆమోదించిన పిదప వాటిపై నిర్ణయం తీసుకునే హక్కు కార్యవర్గానిదే. నెల నెలా జరిగే కార్యవర్గ సమావేశంలో అప్పటివరకు వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం తీసుకోబడుతుంది.

 

అసోసియేట్ నుంచి లైఫ్ మెంబర్ కాదల్చుకున్నవారు పాటించవలసిన నిబంధనలు :

 

  1. ‘అసోసియేట్ మెంబర్’ గా వున్నప్పుడు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన చందాలు బకాయి ఉండరాదు.
  1. లైఫ్మెంబర్’గా మారటానికి కార్యాలయంలో రూ.100/` లు చెల్లించి ’దరఖాస్తు ఫారం’ తీసుకుని పూర్తిచేసి, ‘అడ్రస్ ప్రూఫ్’, ‘ఐ.డి. ప్రూఫ్’(ఆధార్ కార్డు జిరాక్స్), మీ అసోసియేట్ మెంబర్షిప్ ఐడి కార్డు జిరాక్స్ జతపర్చి కార్యాలయానికి అందజేయాలి.
  1. లైఫ్మెంబర్’ గా కావటానికి, మీరు రచనా విభాగంలో పని చేసిన చిత్రంయొక్క పేరు, ఆ చిత్రంలో మీ పేరు ఉన్నదని ఋజువుపరచడానికి ‘డివిడి’ ద్వారా కాని, పెన్ డ్రైవ్ ద్వారా కాని పూర్తి చిత్రాన్ని జతపరచాలి.
  1. పాస్పోర్ట్ సైజు ఫోటోలు’ 2 జతపరచాలి.
  1. అసోసియేట్ నుండి లైఫ్ మెంబర్’కావటానికి తగిన విరాళాన్ని ‘డ్రాఫ్ట్గా’ జతపరచాలి.

 పైవిధంగా పూర్తిచేసిన దరఖాస్తులను అన్ని విధాలుగా పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకునే హక్కు కార్యవర్గానిదే. నెల నెలా జరిగే కార్యవర్గ సమావేశంలో అప్పటివరకు వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం తీసుకోబడుతుంది.