Previous slide
Next slide

అధ్యక్షులవారి పలుకులు

తెలుగు చలన చిత్ర రచయితల సంఘం నా దేవాలయం. అందులో నేను ప్రధాన అర్చకుణ్ణి. రచయిత అంటే సృష్టికర్తతో సమానం. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడిలా, తాను సమాజంలో గమనించిన చిన్న అంశాన్ని రెండున్నర గంటల పాటు కల్పిత పాత్రలతో ఎక్కడో ఇది జరిగింది అని విశ్వసింపజెయ్యగల సమర్ధులు రచయితలు. ఎవరికి వారు నిష్ణాతులే. ఎవరికి వారు ప్రతిభావంతులే. అలాటి మేధోవంతులైన పదిహేనువందల మందికి నాయకత్వం వహించడం అంటే మాటలు కాదు. నొప్పింపిక, తానొవ్వక తప్పించుకుని తిరగడం ఇక్కడ వీలుకాదు. ఒప్పించి తీరాలి. విడమరిచి చెప్పాలి. సంఘానికి ఏది మంచో, ఏది చెడో అర్థమయ్యేలా చెప్పాలి… 

ఆకెళ్ళ గారి పలుకులు

(మాజీ ప్రధాన కారదర్శి)

అది 1993. మద్రాసు నుండి అప్పటికే హైదరాబాదుకి సినిమా వాళ్ళు తరలివస్తున్న రోజులవి. కీ॥శే॥ ఆరుద్ర, కీ॥శే॥ ఆత్రేయ, శ్రీ యస్.పి.బాలు, శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు, డా॥ పరుచూరి గోపాలకృష్ణ, శ్రీ వెన్నెలకంటి, శ్రీమతి పాటిబండ్ల విజయలక్ష్మి, ఇలా చిన్న, పెద్ద రచయితలంతా మద్రాసు కోడంబాకం యం.యం. థియేటర్లో సమావేశం అయ్యారు. అంతకుముందు రచయితల సంఘం మద్రాసులో కీ॥శే॥ ఆత్రేయ, కీ॥శే॥ ఆరుద్ర ఆధ్వర్యంలో కొంతకాలం నడిచినప్పటికీ అనాటికి యాక్టీవ్ గా లేదు. సినీ రచయితలు అందరూ కలిసి ఆ రోజు ఒక రచయితల సంఘాన్ని ఏర్పరచుకోవాలని తీర్మానం చేశారు… 

About Us

ఆకెళ్ళ గారి పలుకులు

(మాజీ ప్రధాన కారదర్శి)

అది 1993. మద్రాసు నుండి అప్పటికే హైదరాబాదుకి సినిమా వాళ్ళు తరలివస్తున్న రోజులవి. కీ॥శే॥ ఆరుద్ర, కీ॥శే॥ ఆత్రేయ, శ్రీ యస్.పి.బాలు, శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు, డా॥ పరుచూరి గోపాలకృష్ణ, శ్రీ వెన్నెలకంటి, శ్రీమతి పాటిబండ్ల విజయలక్ష్మి, ఇలా చిన్న, పెద్ద రచయితలంతా మద్రాసు కోడంబాకం యం.యం. థియేటర్లో సమావేశం అయ్యారు.

అంతకుముందు రచయితల సంఘం మద్రాసులో కీ॥శే॥ ఆత్రేయ, కీ॥శే॥ ఆరుద్ర ఆధ్వర్యంలో కొంతకాలం నడిచినప్పటికీ అనాటికి యాక్టీవ్గా లేదు. సినీ రచయితలు అందరూ కలిసి ఆ రోజు ఒక రచయితల సంఘాన్ని…

Silver Jubilee