ట్రస్టు కార్యకలాపాలు

26-12-2016 నాడు జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఒక వెల్ఫేర్ ట్రస్టుని ఏర్పాటు చేయాలని, తీర్మానం చేయడం జరిగింది.


23-01-2017 నాడు తెలుగు సినీ రచయితల వెల్ఫేర్ ట్రస్టుని, రూ. 10,000/- ల మూలధనంతో రిజిస్టర్ చేయడం జరిగింది. 


మన ట్రస్టుకి ది. 03-05-2017 నాడు 80(జి) & 12(ఎ) కి అప్లై చేసి, తీసుకోవడం జరిగింది. 


జీవిత ట్రస్టీలు :


1. Dr. Paruchuri Gopala Krishna, Chairman

2. Sri. Akella Venkata Suryanarayana, Managing Trustee

3. Sri. P. Satyanand

4. Sri. V. Vijayendra Prasad

5. N.V. Subba Raju

6. Dr. Vaddepalli Krishna

7. Sri. Suddala Ashok Teja

8. Smt. Balabhadrapatruni Ramani 


మన రచయితల సంఘం కార్యవర్గం ది.26-12-2016 నాడు జరిగిన కార్యవర్గ సమావేశంలో తెలుగు సినీ రచయితల సంఘం కార్యవర్గం సూచించిన ఎక్స్-అఫిషియో ట్రస్టీలు.


1.Sri. K. Adithya  

2. Sri. Dasam Venkat Rao 

3. Sri. K. Subhash Chandrabose, (Treasurer) 


ప్రస్తుతం -2022-2023 సంవత్సరానికి గానూ ఎక్స్ అఫిషియో మెంబర్లుగా : 


1. Smt. Umarji Anuradha  

2. Sri. Dasam Venkat Rao 

3. Sri. K. Subhash Chandrabose, (Treasurer)


మొత్తంగా ట్రస్టు కార్యవర్గం 11 మంది. ఎందరో మన సంఘ సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన వారు తమ విరాళాలను ట్రస్టుకు అందజేయడం జరిగింది. అలా వచ్చిన విరాళాలను  మన ట్రస్టు పేరున యూనియన్ బ్యాంక్, (కమలాపురి కాలనీ, కృష్ణానగర్) లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం జరిగింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీగా వచ్చే ఆదాయాన్ని మాత్రమే మనం ఖర్చు పెట్టవలసి ఉంది.


ట్రస్టు నిర్వహించిన కార్యక్రమాలు :


1.ఔత్సాహిక రచయితల కోసం స్క్రీన్ ప్లే క్లాసులు నిర్వహించడం జరిగింది.


2 . మన తెలుగు సినీ రచయితల సంఘం సభ్యుల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది.


3. మన తెలుగు సినీ రచయితల సంఘం వెల్ఫేర్ ట్రస్టు ఆర్థిక సహాయంగా, ఆనారోగ్యంతో బాధ పడుతున్న వారికోసం, పిల్లల చదువులకోసం, ఆయా సమస్యలతో ఇప్పటి వరకూ ఆర్థిక సహాయం కోసం ధరఖాస్తు చేసుకున్న 99 మందికి (వారిలో మన సంఘ సభ్యులు, ఇతర యూనియన్ల సభ్యులు, సినీ రంగంతో సంబంధంలేని ఇతర సామాన్య వ్యక్తులు కూడా వున్నారు.) 


4.మరియు  కరోనా క్రైసెస్ సమయంలో సహాయం కోసం ధరఖాస్తు చేసుకున్న మన తెలుగు సినీ రచయితల సంఘం సభ్యులు, మరియు ఇతర యూనియన్ల నుండి ధరఖాస్తు చేసుకున్న సభ్యులకు, మన తెలుగు సినీ రచయితల వెల్ఫేర్ ట్రస్టు ద్వారా నిత్యవసర సరుకులు పంపిణి చేయడం జరిగింది. 


త్వరలో ట్రస్టు కార్యకలాపాలను మరింత విస్తరించగలమని, ట్రస్టుకి పెద్ద యెత్తున విరాళాలు సేకరించి, ట్రస్టు యొక్క ఆశయాలను నెరవేర్చే ప్రయత్నం చేయగలమని, ఆశిస్తున్నాము. సదా మీ అందరి సహాయం కోరుతూ….

Medical Camp

Screenplay Classes

Trust - Groceries Distribution in Corona pandemic situation

Trust Help to Our members, other Union members and Non-Members