కాపీరైట్ హక్కులు
రచయితకి కాపీరైట్ హక్కులు
కాపీ కొట్టిన రచనకి ఏ హక్కులూ లేకపోయినా అంత బాధించదు గానీ, అసలు సిసలు కొత్త ఆలోచనని ఆవిష్కరించిన కథకి, ఆ కథని సృష్టించిన రచయితకి అన్యాయం జరగకూడదు.
అలాంటి రచనని ఎవరూ దోచుకోకుండా ఎవరూ ఛేదించలేని విధంగా ఒక రక్షణ కవచాన్ని బహూకరించింది మన ప్రభుత్వం. సార్వజనీనత వున్న ఒక్క కథని, బహుళ ప్రజాదరణ పొందగలిగే స్క్రీన్ ప్లే తో, తయారు చేయగలిగితే, ఆ రచయితకి ఆర్ధికంగా ఎ లోటూ రాకుండా జీవితమంతా కాచుకునే విధంగా 2012 లో యిప్పటి Copyright Act తయారయింది.
Legal terminology, Copyright Act లో వున్న ఆంగ్ల భాషని అర్ధం చేసుకోవటం మన లాంటి వాళ్లకి కష్టమే. అయినా నాకు అర్ధమయినంతవరకు, క్లుప్తంగా మనకి అవసరమయినంత మేరకు స్పష్టం చేస్తాను.
1. Copyright Act రచయితకి ఎంత గౌరవం, విలువ, హక్కు యిచ్చిందో యీ ఒక్క వాక్యంతో అర్ధమవుతుంది.
Page 21 Sec 17: Subject to the provisions of Act, the author of a work shall be the First owner of the Copyright there in.
ఒక రచనకి ప్రథమ స్వంతదారుడు, దానిని రచంచిన రచయితే.
సాధారణంగా నిర్మాత తయారుచేయించే Agreement లో తను రచయిత నుండి ఫలానా రచనని కొనుక్కుంటున్నట్టు రాస్తారు. Act ప్రకారంగా అది చెల్లదు. రచయిత నిర్మాతకి తన రచనని సినిమాగా చేసేందుకు అనుమతిని [Assignment] యిస్తున్నట్టుగానే వుండాలని ACT స్పష్టంగా చెప్తోంది. పొరపాటున ఎక్కడ కూడా Sold, Selling [అమ్మేశాను, అమ్ముతున్నాను] అని వుండకూడదు. అలా వుంటే? ఏ కారణంగా నయినా కోర్టుకి వెళ్తే, అది ACT కి వ్యతిరేకంగా వున్నందున అగ్రిమెంట్ చెల్లదు. రచనకి ప్రథమ స్వంతదారుడు రచయితే అన్నది స్పష్టంగా వుండాలి. అగ్రిమెంట్ చెల్లకపోతే నష్ట పోయేది నిర్మాత, రచయిత కాదు.
2. రచయితకీ, నిర్మాతకీ మధ్య లిఖితపూర్వకంగా ఒప్పందం ACT నిర్ధేశించిన విధంగా వుండి తీరాలని, అలా లేకపోతే, లేదా అగ్రిమెంటు లేకుండా సినిమా నిర్మించినా, ఆ సినిమా మీద నిర్మాతకి హక్కులు వుండవని చెబుతోంది. అంటే అగ్రిమెంటు లేకపోతే రచయితకే హక్కులన్నీను. కాబట్టి అగ్రిమెంట్ అన్నది రచయిత కన్నా, నిర్మాతకే ఎక్కువ అవసరం.
3. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మీ రచన, మీదే అన్న సాక్ష్యం బలంగా వుండాలి. అది కథగానో, నవలగానో, నాటకం గానో, ఏదో ఒక విధమయిన రచనగా, ప్రజలకి పత్రికలలోనో Tv లోనో, సినిమాగానో, రంగస్థలం మీదనో, digital platform మీదనో, మరే విధమయిన మాధ్యమంలోనో చేరివుంటే, ఆ రచన మీద మీకు సర్వ హక్కులూ దక్కినట్టే. మీ రచన ప్రజల ముందుకి వెళ్లేలోగా వేరేవాళ్లెవరూ తస్కరించకుండా కాపు కాసేది మన సంస్థలాంటి రచయితల సంస్థలు, యింకా ఢిల్లీలో వున్న Copyright Society మాత్రమే. మీ రచన మీదికాదు, అది నాది అని ఎవరయినా కోర్టుకి వెళ్తే, యీ సంస్థల్లో మీరు మీ రచనని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నిరూపించుకుంటే, ఆ తేదీ నాటికి మీ మీద నేరం మోపిన వ్యక్తి దగ్గర అంతకుముందే తను రచించినట్టు ఆధారాలు లేకపోయివుంటే, మీరు గెలిచినట్టే. ఒకవేళ ఆ సదరు వ్యక్తి ఆ కథని మీ Registration తేదీ కన్నా ముందుగానే, పత్రికలో రచనగానో, నాటకంగా ప్రదర్శించానని నిరూపిస్తే, మీరు ఓడిపోయినట్టే. అంతేకాదు, ఆ వ్యక్తి తన రచనని e-mail లో భద్రపరచివున్నా, అతనికి సాక్ష్యం వున్నట్టే.
Electronic medium is also an acceptable evidence అని కొన్నేళ్ల క్రితం సుప్రీం కోర్టు ప్రకటించింది.
4. కాపీ రచనలకి ఏ హక్కులూ వుండవు పైగా దండనీయం. ఏది కాపీ, ఏది కాదు అని నిర్ణయించేది మీ రచనే. స్పూర్తిని పొందటం హక్కు. కాపీ కొట్టటం నేరం. కేవలం స్పూర్తి పొంది కొత్త కథని తయారు చేస్తే,… చేయగలిగితే… అసలు రచయిత కూడా అది తన కథే అని పోల్చుకోలేనంత గొప్పగా చెయ్యాలి. అప్పుడు ఏ సమస్యా వుండదు. దీనికి కోకొల్లలుగా వుదాహరణలున్నాయి.
5. Sec 18 ఏం చెబుతోందో చూడండి: ……… Provided that in the case of the assignment of copyright in any future work, the assignment will take effect only when the work comes into existence.
అంటే సినిమా తయారయిన తరువాతనే, రచయిత నిర్మాతకి అనుమతి రాసి యిచ్చిన అగ్రిమెంటు అమలులోకి వస్తుంది.
6. Page-23 Sec-18 Provided also that the author of the Literary or Musical work included in a Cinematograph film shall not assign or waive the right to receive royalties to be shared on an equal basis with the assignee of Copyright for the utilisation of such work in any form other than for the communication to the public of the work along with the cinematograph film in a cinema hall, except to the legal heirs of the authors or to a copyright society for collection and distribution and agreement to contrary shall be void.
సూక్ష్మంగా చెప్పాలంటే, మీ సాహిత్యంగానీ, సంగీతం గానీ ఏ సినిమాలో వాడుకునేందుకు అనుమతించారో ఆ సినిమాని, సినిమా హాల్స్ లో ప్రదర్శించే హక్కు మాత్రమే నిర్మాతకి చెందివుంటుంది. ఆ తరువాత ఆ సినిమాని మరే విధమయిన రీతిలో వ్యాపార నిమిత్తం వాడుకుంటే, దాని కారణంగా అందుకున్న లాభాలలో 50% తీసుకునే హక్కు, రచయితగా మీకు గానీ, మీ వారసులకి గానీ, లేదా మీ తరఫున వసూలు చేసే కాపీరైటు సొసైటీ కి గానీ వుంటాయి. ఈ 50శాతం హక్కుని వదులుకునేందుకు, సదరు రచయితగా మీకు కూడా ఆ అధికారం లేదని స్పష్టంగా చెబుతోంది.
7. Page-24 Sec-19[1] Mode of Assignment
No assignment of the Copyright in any work shall be valid unless it is in writing signed by the assignor or by his duly authorised agent.
నిర్మాత గానీ, నిర్మాత తరఫున వ్యక్తి గానీ లిఖితపూర్వకంగా అగ్రిమెంటులో సంతకం చేసిన తరువాతనే, రచయిత తన రచనని వాడుకునేందుకు నిర్మాతకు యిచ్చిన అనుమతి చెల్లుతుంది. అంటే తప్పనిసరిగా నిర్మాత రచయిత నుంచి అనుమతి పత్రం పొందితీరాల్సిందే.
8. Page-25 Sec-19[4] Where the assignee does not exercise the rights assigned to him under any of the sub-sections of this section within a period of one year from the date of assignment, the assignment in respect of such rights shall be deemed to have lapsed after the expiry of the said period unless otherwise specified in the assignment.
ముందుగానే అగ్రిమెంటులో రాసివుండకపోతే, నిర్మాత ఏ కారణంగానైనా, రచయిత తనకిచ్చిన అనుమతిని ఏడాది లోగా వుపయోగించుకోలేకపోతే, ఆ రచనమీద తన హక్కుని కోల్పోతారు.
9. Page-25 Sec-19[5] If the period of assignment is not stated, it shall be deemed to be five years from the date of assignment.
రాసుకున్న అగ్రిమెంటు లో ఒప్పందం ఎన్నాళ్లవరకు అని వివరంగా తెలియజేయకపోతే, ఆ ఒప్పందం అయిదేళ్లవరకు మాత్రమే చెల్లుతుంది.
10. Page-25 Sec-19[9] No assignment of copyright in any work to make a cinematograph film shall affect the right of the author of the work to claim an equal share of Royalties and consideration payable in case of utilisation of the work in any form other than for the communication to the public of the work, along with the Cinematograph film in a cinema hall.
తన రచనని సినిమాగా చేసేందుకు రచయిత నిర్మాతకి ఎలాంటి అనుమతి యిచ్చినా, సినిమాని థియేటర్లలో ప్రేక్షకులకి చూపించటానికి తప్ప, మరేవిధంగానయినా ఆ సినిమాని వుపయోగించుకుంటే, దానికి వచ్చిన లాభాలలో సగభాగం తీసుకునే హక్కు రచయితకి వుంటుంది.
11. Page-25 Sec-19[10] No assignment of the copyright in any work to make a Sound recording which does not form part of any cinematograph film shall affect the right of the author of the work to claim an equal share of royalties and consideration payable for any utilisation of such work in any form.
ఇంతకుముందు చెప్పిన విధంగానే, సినిమా కోసం కాకపోయినా, రచయిత రాసిన రచన సౌండ్ రికార్డింగ్ జరిగితే, దాని కారణంగా వచ్చిన ఆదాయంలో సగభాగం రచయితకి చెందుతుంది.
12. Page-27 Term of Copyright: Except as otherwise hereinafter provided, copyright shall in any literary, dramatic, musical or artistic work published within the lifetime of the author until sixty years from the beginning of the calendar year next following the year in which the author dies.
ఈ కాపీరైట్ అన్నది రచయితకి ఎన్నాళ్లు వుంటుంది? సాహిత్యం, సంగీతం,నాటకం, లేదా యింకే ఏ విధమయిన సృజనాత్మక రచన అయినా సరే, దాని మీద రచయితకి తన జీవితకాలం తో పాటు, అతను చనిపోయిన తరువాత మరుసటి సంవత్సరం మొదటి రోజు నుంచి అరవై యేళ్ల వరకు కాపీరైటు హక్కులు చెందివుంటాయి.
13. Page- 78 Sec-63 Offence of infringement of copyright or other rights conferred by this act:
Any person who knowingly infringes or abets the infringement of… a) the copyright in a work, or b) any other right conferred by this act…. shall be punishable with imprisonment for a term which shall not be less than six months but which may extend to three years and with fine which shall not be less than fifty thousand rupees but which may extend to two lakh rupees.
Copyright Act రచయితకి యిచ్చిన హక్కులు ఉల్లంఘించటం నేరం అని 78 వ పేజీలో స్పష్టంగా వివరించివుంది. ఏ వ్యక్తి అయినా తెలిసీ తెలిసీ, ఒక రచనకి సంబంధించిన హక్కులని ఉల్లంఘిస్తే, ఆ నేరానికి ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు జరిమానా వుంటుందని హెచ్చరిస్తోంది.
——————————————————————————–
సూక్ష్మంగా యివీ ప్రతి సృజనాత్మక రచయితా తెలుసుకుని తీరవలసిన హక్కులు. ఒక్కొక్క సెక్షన్ లోనూ మళ్ళీ ఎన్నో వివరాలున్నాయి. వాటి ఆధారంగా లాయర్లు ఏవో సమస్యలు సృష్టించవచ్చు. అందుకని, ఎందుకయినా మంచిది, నిర్మాతతో చేసే అగ్రిమెంట్లో చివర్న ఒక వాక్యం కలిపితే శ్రేయస్కరం + ఉభయ కుశలోపరి. అదేమిటంటే ….
….that both the parties are well aware of the copyright act 2012 and will abide by its sections, in case of any dispute that arises.
ఇలా చివర్నరాసుకుంటే ఎవరికీ అన్యాయం జరగదు. రచయితగా మీ హక్కుల్ని మీరు కాపాడుకుంటే, అవి మీ తదనంతరం, అరవై ఏళ్ల వరకు మీ కుటుంబానికి వారసత్వంగా నిలిచి వుంటాయన్న సత్యాన్ని మరిచిపోకండి.